సియోల్ : అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక శిక్షణ కార్యక్రమాలకు
వ్యతిరేకంగా తక్షణం గట్టి ప్రతీకార చర్యలకు తమ దేశం సిద్ధంగా ఉందని ఉత్తర
కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ హెచ్చరించారు.
అమెరికా- దక్షిణ కొరియా సైనిక శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం అణు
సామర్థ్యం గల బి-52 యుద్ధ విమానాన్ని కొరియన్ ద్వీపకల్పంపై ప్రయోగించారు.
అలానే ఆ రెండు దేశాల మిలిటరీ దళాలు ఈ నెలలో క్షేత్రస్థాయి విన్యాసాలను
పునర్ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్ యో జాంగ్
హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఆమె ప్రకటనలో ఎలాంటి
కార్యాచరణనూ వెల్లడించలేదు. అమెరికా- దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను ఉత్తర
కొరియాపై దురాక్రమణకు రిహార్స్ల్గా ఆ దేశం భావిస్తోంది. కిమ్ యో జాంగ్
హెచ్చరికలు చేసిన కొన్ని గంటలకే ఆ దేశ సైన్యం (కొరియన్ పీపుల్స్ ఆర్మీ) సైతం
ఓ ప్రకటన జారీచేసింది. తమ శతఘ్ని దళాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపింది.