వృద్ధుల సంఖ్య పెరిగింది. దీంతో వన్ చైల్డ్ పాలసీని పక్కన పెడుతూ కొత్తగా
పెళ్లి చేసుకున్న జంటలకు ఆ దేశ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. ‘ఇద్దరు
వద్దు.. ఒకరే ముద్దు’ అంటూ గతంలో చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ దేశ
జనాభా పై తీవ్ర ప్రభావం చూపింది. దేశంలో జనాభా తగ్గిపోతుండడంతో తాజాగా మరో
కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు నెల రోజుల వేతనంతో
కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల దేశంలో జననాల సంఖ్య
పెరుగుతుందని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక
పీపుల్స్ డైలీ హెల్త్ ఈ విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా చైనాలో పెళ్లి
చేసుకుంటే మూడు రోజులకు మించి సెలవులు ఇవ్వరు. తాజాగా కొన్ని ప్రావిన్స్‌లలో
మాత్రం వివాహాలను ప్రోత్సహిస్తూ జననాల రేటును పెంచాలనే ఉద్దేశంతో కొత్తగా
పెళ్లి చేసుకున్న జంటలకు నెల రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని
నిర్ణయించాయి.
‘‘కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి సెలవులు పొడిగించి, దేశ వ్యాప్తంగా జననాల
రేటును పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. చైనాలో కొన్ని ప్రావిన్స్‌లు,
నగరాల్లో జననాల రేటు గణనీయంగా తగ్గింది. ఇది దేశ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర
ప్రభావం చూపుతుంది. దేశవ్యాప్తంగా మానవవనరులలో పెరుగుదల అవసరం ఉంది. అందుకే
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’’ అని సౌత్‌వెస్ట్రన్ యూనివర్శిటీలో
ఆర్థికశాస్త్ర విభాగం డీన్‌గా పనిచేస్తున్న యాంగ్ హయాంగ్ తెలిపారు. చైనా గతంలో
అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ కారణంగా 1980 నుంచి 2015 వరకు ఆ దేశ జనాభా
పెరుగుదల రేటు గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల చైనా ఆర్థికవ్యవస్థపై తీవ్ర
ప్రభావం పడటంతోపాటు దేశంలో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగింది.
గతేడాది ఆ దేశ గణాంకాల ప్రకారం జననాల రేటు వెయ్యి మందికి 6.77 శాతం ఉంది.
తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో నెల రోజుల సెలవులను ఎంజాయ్ చేయొచ్చని కొత్త జంటలు
భావిస్తున్నాయట.