వాషింగ్టన్ : ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత అమెరికా, రష్యాల మధ్య వైరం
మరింత పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇటువంటి వేళ ఓ
ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలు పెట్టకముందు
రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ఖరీదైన
బహుమతి అందుకున్నారట. దాని విలువ 12 వేల డాలర్లు (సుమారు రూ.10 లక్షలు)
ఉంటుందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 2021లో
జెనీవాలో జరిగిన ఓ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు
పుతిన్‌లు భేటీ అయ్యారు. ఆ సందర్భంలో విలక్షణమైన రష్యన్ పెన్నుతోపాటు డెస్క్
సెట్‌ను పుతిన్ బైడెన్‌కు ఇచ్చారట. దాని విలువ 12వేల డాలర్లు (సుమారు 10
లక్షలు) ఉంటుందని అమెరికా విదేశాంగశాఖ చెందిన ప్రోటోకాల్ విభాగం
వెల్లడించింది. అదే సమయంలో ఓ జత ఏవియేటర్ చలువ కళ్లద్దాలు
(సన్‌గ్లాసెస్)తోపాటు అమెరికా జాతీయ జంతువైన అడవి దున్న క్రిస్టల్ నమూనాను
పుతిన్‌కు బైడెన్ అందజేశారు.