అమెరికా : శీతాకాలపు మంచు తుపానులు అమెరికాను వణికిస్తున్నాయి. విపరీతమైన మంచు
కారణంగా ఓరెగాన్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో అనేక చోట్ల రాకపోకలు
నిలిచిపోయాయి. ఎడతెరిపిలేకుండా మంచు కురవడం వల్ల లక్షలాది ఇళ్లకు విద్యుత్
సరఫరా నిలిచిపోయింది. వేలాది పాఠశాలలు మూతపడ్డాయి. విమానాల రాకపోకలు
నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలపు మంచు తుపానులు
అమెరికాను చుట్టుముట్టాయి. ఎక్కడ చూసినా మంచుతో కప్పి ఉన్న ప్రదేశాలే
కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాలను మంచు కప్పేసింది. ఓరేగాన్ రాష్ట్రంలోని
పోర్ట్‌ల్యాండ్‌లో దాదాపు 25 సెంటిమీటర్ల మేర మంచు కురిసింది. మంచు ప్రభావంతో
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి, రోడ్డుపై వాహనదారులు చిక్కుకున్నారు. మంచును
తొలిగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొంతమంది వాహనాలదారులు
రాత్రంతా వాహనాల్లోనే ఉండిపోయారు. మంచు భారీగా కురవడం వల్ల లక్షలాది ఇళ్లకు
విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాఠశాలలు మూతపడ్డాయి. దాదాపు 2వేల విమానాలు
రద్దయ్యాయి. మంచు వల్ల పోర్ట్‌ల్యాండ్ రహదారిపై దాదాపు 13 గంటలపాటు ట్రాఫిక్
నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.