వార్సా : తమ దేశంతో కుదుర్చుకున్న ‘న్యూ స్టార్ట్’ అణు ఒప్పందం నుంచి రష్యా
తాత్కాలికంగా వైదొలగడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పుబట్టారు.
దాన్నుంచి ప్రస్తుతానికి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా రష్యా
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్ద తప్పు చేశారని విమర్శించారు. పోలండ్
పర్యటనలో భాగంగా ‘బుకారెస్ట్ 9’ కూటమిగా పేరొందిన నాటో భాగస్వామ్య దేశాల
నేతలతో సమావేశమైన బైడెన్ పలు అంశాలపై మాట్లాడారు. ఎలాంటి క్లిష్ట
పరిస్థితుల్లోనైనా వారికి అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్పై
యుద్ధంలో రష్యా విజయం సాధిస్తే.. పుతిన్ తమ దేశాలపైనా సైనిక చర్యలకు దిగే
ముప్పుందని ‘బుకారెస్ట్ 9’ దేశాలు ఆందోళన చెందుతున్న సంగతి గమనార్హం.