వాషింగ్టన్ : ఆయనకు ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయ్యి విడాకులు అయ్యాయి. తాజాగా
నాలుగో పెళ్లి చేసుకున్నారు. అదీ పుట్టినరోజు నాడే. అంతలా ఆయన గురించి
ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారా?. చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి
వ్యక్తి ఎవరు?. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కదా!. మరి రెండో వ్యక్తి ఎవరు?. ఈయనే
ఆయన. పేరు ఎడ్విన్ బజ్ అల్డ్రిన్. అమెరికా మాజీ వ్యోమగామి. అపోలో 11 మిషన్
ద్వారా చంద్రుడిపై పాదం మోపి.. సంచరించిన ముగ్గురు వ్యోమగాముల్లో ఈయన కూడా
ఒకరు. పైగా ఆ బ్యాచ్‌లో ఇంకా బతికి ఉంది కూడా ఈయనే. ఎడ్విన్ బజ్
అల్డ్రిన్.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చంద్రుడిపై పాదం మోపిన రెండో
వ్యక్తి. ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు 19 నిమిషాల చంద్రుడిపై సంచరించారీయన. నీల్
ఆర్మ్‌స్టాంగ్ ఈ మిషన్‌లో కమాండర్‌గా వ్యవహరించగా ఎడ్విన్ బజ్ అల్డ్రిన్
‘లునార్ మాడ్యుల్ పైలట్’గా వ్యవహరించారు. ఇక మైకేల్ కోలిన్స్ కమాండ్
మాడ్యుల్ పైలట్‌గా పని చేశారు. అపోలో 11 మిషన్ 1969 జులై 16వ తేదీన లాంఛ్
కాగా, జులై 20వ తేదీన చంద్రుడిపై తొలిసారిగా మానవుడు అడుగుపెట్టాడు.
చంద్రుడిపై కాలుమోపి చరిత్ర లిఖించిన అమెరికా వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ 93
ఏళ్ల వయసులో వివాహబంధంలోకి మరోసారి అడుగుపెట్టారు. ఇప్పటికే ముగ్గురు భార్యలకు
విడాకులిచ్చిన ఆయనకు ఇది నాలుగో పెళ్లి కావడం గమనార్హం. 1969లో అపోలో 11
ప్రాజెక్టులో భాగంగా నాసా పంపిన ముగ్గురు వ్యోమగాముల్లో ఆల్డ్రిన్ ఒకరు.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అడుగుపెట్టిన 19 నిమిషాల తర్వాత ఆల్డ్రిన్ చంద్రుడిపై
కాలుమోపారు. తాజాగా ఆయన తన చిరకాల ప్రేయసి డా.ఆంకా ఫార్ను వివాహం
చేసుకున్నారు. ఆమెకు ప్రస్తుతం 63 ఏళ్లు. ‘‘నా 93వ పుట్టినరోజున ప్రేయసి
ఆంకాను లాస్ఏంజెలెస్లో వివాహం చేసుకున్నా. ఇంట్లోనుంచి పారిపోయి ప్రేయసిని
పెళ్లాడిన టీనేజర్ అంత ఉత్సాహంగా ఉన్నాను’’ అంటూ ఈ మాజీ వ్యోమగామి ట్వీట్లో
రాసుకొచ్చారు. అపోలో 11లో వెళ్లిన ఆ ముగ్గురు వ్యోమగాముల్లో జీవించి ఉన్న ఏకైక
వ్యక్తి ఆల్డ్రిన్.