విశాఖపట్నం : విశాఖ నగరంలో ఈ నెల 11,12 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన, బహిరంగ సభ ఎర్పాట్లపై పార్టీ నాయకులతో వైస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరగనున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విజయసాయిరెడ్డి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం మద్దిలపాలెం పార్టీ నగర కార్యలయలో ఎంపి విజయ సాయిరెడ్డి, ఉమ్మడి విశాఖ పార్టీ రీజనల్ కోఆర్టినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎంపి మాధవి, మాజీమంత్రి అవంతి శ్రీనివాస్,ఎమ్మెల్యేల బాగ్యలక్ష్మీ, అదీప్ రాజ్, శెట్ట పాల్గుణ, తిప్పాల నాగి రెడ్డి,ఎమ్మెల్సీల వరుదు కళ్యాణి, వంశీకృష్టయాదవ్ తదితరలు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.