ఆశ్రమ నిర్వాహకుడిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సరైన చర్య తీసుకోవడంలో విఫలమైందని ఢిల్లీ హైకోర్టు విమర్శించింది. 162 మంది బాలికలను తమ ఇష్టం లేకుండానే ఆశ్రమంలో బలవంతంగా ఉంచారని, దాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఓ స్వచ్ఛంద సంస్థ సీబీఐపై అభియోగాలు మోపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఢిల్లీలోని రోహిణి పరిసరాల్లో స్వీయ వర్ణిత దైవం వీరేంద్ర దేవ్ దీక్షిత్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఆశ్రమంలోని ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయంపై నాలుగు వారాల్లోగా చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆశ్రమ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవడంలో సీబీఐ విఫలమైందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.