అమరావతి : నాడు నేడు చేపట్టిన ప్రతి స్కూలుకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉండాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకూ ‘ టీచర్స్ కాన్సెప్ట్’ సమర్థవంతగా అమలు చేయాలని ఆదేశించారు. 2024–25లో సీబీఎస్ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మరింత తోడుగా నిలవడానికి బోధనలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా పాఠశాలలో ఉన్న ప్రతి క్లాస్‌రూం డిజిటలైజేషన్ కావాలని సీఎం నిర్దేశించారు. గోరుముద్ద అమలు ప్రక్రియ కూడా పక్కాగా ఉండాలని ఆదేశించారు. సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, పాఠశాల మౌలికవసతులు కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వి శేషగిరిబాబు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ మీనా, ఎస్ఎస్ఏ ఏఎస్పీడీ బి శ్రీనివాసులు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.