ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచుకు ముందు పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని కీలక ఆటగాడు, ఆల్ రౌండర్ షాన్ మసూద్ తీవ్రంగా గాయపడ్డాడు. టీమ్ఇండియా మ్యాచ్ కోసం నెట్స్‌లో సాధన చేస్తుండగా అతడి తలకు బంతి తగిలింది. నొప్పితో విలవిల్లాడిన అతడు అక్కడే కూలిపోయాడు.. వెంటనే జట్టు సభ్యులంతా అతడిని మెల్బోర్న్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వచ్చే రిపోర్టుల ఆధారంగా మసూద్ భవిష్యత్తును నిర్ణయించనున్నారు.
ఇప్పటికైతే టీమ్ఇండియాతో మ్యాచులో ఆడడని సమాచారం. పాక్ మిడిలార్డర్లో మసూద్ కీలకమని తెలిసింది. ‘ఎంసీజీ నెట్స్‌లో సాధన చేస్తుండగా షాన్ మసూద్ తలకు కుడివైపు బంతి తగిలింది. ముందు జాగ్రత్తగా స్కాన్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు’ అని పీబీసీ ప్రకటించింది. 33 ఏళ్ల మసూద్ ఇప్పటివరకు పాకిస్తాన్ తరపున 12 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు, 125.00 స్ట్రైక్ రేట్‌తో 220 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధసెంచరీలున్నాయి. ఐకానిక్ గ్రౌండ్లో కేవలం రెండు రోజుల వ్యవధిలో భారత్ మ్యాచ్‌కు ముందు ఈ గాయం పాకిస్తాన్‌కు పెద్ద దెబ్బగా మారింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే సూపర్ 12 దశలో గ్రూప్ 2 రెండవ మ్యాచ్‌గా ఇది గుర్తించబడుతుంది.
మూలం: హిందూస్తాన్ టైమ్స్