మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎన్నికల సంఘం నుంచి పెద్ద ఎదురుదెబ్బతగిలింది. విదేశీ నేతల నుంచి తనకు లభించిన బహుమతులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్నిదాచినందుకు ‘తోషాఖానా’ కేసులో ఐదేళ్లపాటు ప్రభుత్వ పదవుల్లో కొనసాగడం పై పాకిస్థాన్ అత్యున్నత ఎన్నికల సంఘం శుక్రవారం వేటు వేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికిందర్ సుల్తాన్ రాజా నేతృత్వంలోని నలుగురు సభ్యుల బెంచ్ ఈ మేరకు ఏకాభిప్రాయ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు ప్రకారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఐదేళ్లపాటు పార్లమెంటు సభ్యుడు కాలేరు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.
నివేదికల ప్రకారం.. క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత రాజకీయ నాయకుడుగా మారారు. ఈ క్రమంలో జూలై 2018, జూన్ 2019 మధ్య 31 ఖరీదైన బహుమతులు పొందారు. అయితే వాటిలో కేవలం నాలుగింటిని మాత్రమే చూపించారు. ఆ దేశ మార్గదర్శకాల ప్రకారం, రూ.30,000 కంటే తక్కువ విలువైన బహుమతిని ఎటువంటి చెల్లింపు లేకుండా ఉంచుకోవచ్చు. ఈ మేరకు పాకిస్తాన్ చట్టాలు అనుమతిస్తాయి. అయితే తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ జులై 2019, జూన్ 2020 మధ్య తొమ్మిది బహుమతులు అందుకున్నారు. వాటిలో మూడింటికి రూ. 1.71 మిలియన్లు చెల్లించారు. ఈ కానుకలను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బహుమతిగా ఇచ్చారని కూడా పేర్కొన్నాడు. బహుమతుల్లో ఒకటి డైమండ్ రింగ్, ఒక జత బంగారం, వజ్రాల చెవిపోగులు, లాకెట్‌తో కూడిన ప్యాకేజీ ఉన్నాయి. ఈ ఆభరణాలను పొందడానికి అతను రూ. 0.544 మిలియన్లను డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా,
ఖాన్ జూలై 2020, జూన్ 2021 మధ్య 12 బహుమతులు అందుకున్నారని, వాటిలో ఐదింటికి రూ. 12.90 మిలియన్లు చెల్లించారని చెప్పబడింది. అదే సమయంలో, జూలై 2021 నుంచి జూన్ 2022 మధ్య, అతను మరో ఆరు బహుమతులు అందుకున్నాడు. వాటిలో రెండింటికి రూ. 3.10 మిలియన్లు చెల్లించాడు. వీటిలో చాలా బహుమతులను ఆయన దాచి నట్లు పాక్ ఎన్నికల సంఘం వెల్లడించడంతో పాటు నిషేధం అమలు చేసింది.
మూలం: ఇండియా టీవీ వార్తలు