సంగీత ప్రపంచంలో గ్రామీ సంగీత అవార్డును దక్కించుకున్న సంగీత దర్శకుడు రికీ కేజ్ దాదాపు 31 గంటల పాటు విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబరు 18న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి బయలుదేరిన ఫ్రాంక్ఫర్ట్-బెంగళూరు లుఫ్తాన్స విమానం ఆన్-బోర్డ్ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టర్కీలోని ఇస్తాంబుల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
కొన్ని సాంకేతిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత, ప్రయాణీకులను డీబోర్డ్ చేసిన తర్వాత విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా, ప్రయాణికులు 31 గంటలకు పైగా ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. అంతేకాకుండా, విమానంలోని ప్రయాణీకులకు సిబ్బంది నుంచి ఎలాంటి సేవలు గానీ, సౌకర్యాలు గానీ లభించలేధు.
ఈ ప్రయాణికుల్లో ఒకరైన గ్రామీ విజేత సంగీత దర్శకుడు రికీ కేజ్ తన అనుభవాన్ని ట్వీట్ చేశాడు. “లుఫ్తాన్సా భారతీయ కస్టమర్లను ఎలా తీసుకుంటుందో నమ్మలేకపోతున్నాను. నేను ప్రయాణిస్తున్న ఫ్రంక్ఫర్ట్-బ్లోర్ విమానం గత సాయంత్రం 7 గంటలకు ఇస్తాంబుల్లో మెడికల్ ఎమర్జెన్సీ కోసం దిగింది. 17 గంటల తర్వాత కూడా ఎలాంటి సమాచారం లేదు. హోటల్ లేదు, సిబ్బంది లేదు, పైగా ఎలాంటి వివరణ కూడా లేదు. నాతో పాటు మరో 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఎలాంటి సమాచారం లేదు” అంటూ ఆయన అక్టోబరు 19న మధ్యాహ్నం ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశాడు.
మూలం: జీ న్యూస్