ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను ఎక్స్టర్నల్ గిగ్ వర్క్ చేపట్టడానికి అనుమతించింది. భారతదేశంలో అలా చేసిన మొదటి పెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థగా ఇన్ఫోసిస్ అవతరించింది.
గిగ్ వర్క్‌ను గుర్తించి, ప్రారంభించేందుకు కంపెనీ తీసుకున్నచర్య ఒక అడుగు ముందుకు వేసి ట్రెండ్‌సెట్టర్‌గా కూడా మారినట్లయింది. ఐటి పరిశ్రమలో ఇతర వైట్ కాలర్ వర్క్ సెక్టార్లలో మూన్‌లైటింగ్, ఉద్యోగుల హక్కుల గురించి ఇటీవలి కాలంలో పెద్ద చర్చ కొనసాగుతోంది. “ఇన్ఫోసిస్ లేదా ఇన్ఫోసిస్ క్లయింట్లతో పోటీ పడని సంస్థల కోసం, ఏ ఉద్యోగి అయినా, వారి మేనేజర్, హెచ్ ఆర్ ముందస్తు సమ్మతితో, వారి వ్యక్తిగత సమయంలో గిగ్ వర్క్ చేపట్టాలనుకునే వారు అలా చేయవచ్చు” అంటూ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ సంస్థ ఈమెయిల్ పంపిస్తోంది.
అయితే ఈమెయిల్ ఎక్కడా కూడా ‘మూన్‌లైటింగ్’ అనే పదాన్ని ప్రస్తావించకపోవడం విశేషం. ఎందుకంటే ఈ పదం సాంకేతికంగా ద్వంద్వ ఉపాధిని సూచించడమే కారణం. ఈమెయిల్ బదులుగా ఉద్యోగులు వారి ఉపాధి ఒప్పందానికి నేరుగా విరుద్ధంగా లేని సైడ్ ప్రాజెక్ట్‌లను చేపట్టడంలో సహాయపడే మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఆఫర్ రావడంపై ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మూలం: మనీకంట్రోల్