ఒత్తిడి అనేది ప్రతి వ్యక్తీ రోజూవారీగా ఎదుర్కొనే ఒక మానసిక సమస్య. కానీ,
కొన్నిసార్లు వ్యక్తులు తాము ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నామనేది గుర్తించలేరు.
బిజీ షెడ్యూల్స్, రిలేషన్షిప్ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, నిశ్చల జీవనశైలి,
ఫాస్ట్ ఫుడ్ వినియోగం.. ఇలా ఒత్తిడికి చాలా కారణాలు ఉన్నాయి. వృత్తిపరమైన
సవాళ్ల నుంచి వ్యక్తిగత జీవితంలో జరిగిన గాయాల వరకు నిరంతరమైన ఆలోచనలతో
హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇవన్నీ ఒత్తిడిని ప్రేరేపించవచ్చు. ఒత్తిడి,
ఆందోళనలు తీవ్రమైతే అది మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్,
గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్యం కోసం
ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటి నుంచి పని చేసేవారు కూడా
ఒత్తిడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాశ్చాత్య ప్రపంచంలో ఇది కొత్త విషయం
కానప్పటికీ, భారతదేశంలోని చాలా మంది టెక్కీలకు ఇది పెద్ద సమస్యగా
పరిణమించింది.
భారతదేశంలో శ్రామిక ప్రజల ఒత్తిడి స్థాయిలు గత మూడు సంవత్సరాలుగా
పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి ప్రారంభ రోజుల నుంచి ఈ సమస్య మరింత భయంకరంగా
పెరిగింది. వయోజన జనాభాలో కనీసం 50 శాతం మంది వ్యక్తిగత లేదా వృత్తిపరమైన
కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చాలా మంది
వ్యక్తులు సోమరితనంతో శారీరక కార్యకలాపాలను ఎంచుకోరు. కానీ, చురుగ్గా వుండడం
వల్ల వ్యక్తులు వారి ఒత్తిడిని కాల్చగలరనే వాస్తవాన్ని అనేక శాస్త్రీయ
అధ్యయనాలు వెల్లడించాయని డాక్టర్ రవి శ్రీనివాస్ తెలిపారు. మితమైన వ్యాయామం
మానసిక ఒత్తిడిని తగ్గించి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు సహాయపడుతుందని
ఆయన అన్నారు.
మెజారిటీ యువ బాధితులు ఒత్తిడి వల్ల కలిగే పరధ్యానం కారణంగా ప్రాణాంతక
ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పవచ్చు. కాబట్టి ప్రజలు ఒత్తిడి-రహిత
జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాల్సి వుంది.