ప్రపంచంలోని పలు దేశాల్లో మళ్లీ కరోనావైరస్ బారినపడుతున్న వారి సంఖ్య
క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం
కోవిడ్-19 ఉప్పెనకు కారణమైన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్ లోనూ
వెలుగుచూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాగే రాష్ట్ర
ప్రభుత్వాలను సైతం అలర్ట్ చేస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి
చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ
ప్రయాణికులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా
వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్-19
ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. “దేశంలోకి
వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల్లో భాగంగా చైనా, జపాన్, దక్షిణ కొరియా,
హాంకాంగ్, థాయ్లాండ్ నుంచి వచ్చేవారికి RT-PCR పరీక్ష తప్పనిసరి” అని ఆరోగ్య
మంత్రి మన్సుఖ్ మాండవియా శనివారం ప్రకటించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున
ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి మాండవియా చెప్పారు. ఈ దేశాల నుంచి
ప్రయాణీకులెవరైనా రాగానే రోగ లక్షణంగా గుర్తించబడినా, కోవిడ్ పాజిటివ్ అని
తేలినా క్వారంటైన్లో ఉంచుతారని ఆయన చెప్పారు.