మంచి నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సాధారణంగా నిద్రలేమి సమస్యకు ప్రధానంగా
ఆర్థిక కారణాలు, ఆరోగ్య కారణాలు, మారుతున్న జీవనశైలి ఇలాంటి ప్రధాన కారణాల
వల్ల మంచి నిద్రకు దూరమవుతున్నారు. ఉదయం లేచింది మొదలు అనే క ఒత్తిడులతో జీవనం
గడిపేవారు నిద్రలేమిని ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్నారు. ఫలితం శారీరక, మానసిక
ఆరోగ్య సమస్యలెన్నో చుట్టుముడుతున్నాయి. యాంత్రిక జీవనంలో చాలామందికి మంచి
నిద్ర అన్నదే గగనమవుతోంది. తగినంత నిద్రలేకుంటే మానసిక, శారీరక సమస్యలు
తప్పవు. నిద్రలేమి చాలా ఆరోగ్య సమస్యలకు హేతువని వైద్య నిపుణులు హెచ్చరిస్తునే
ఉన్నారు. మంచి నిద్రవల్ల భవిష్యత్తులో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు.
ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఇంటి చిట్కాలను
పాటించడం వల్ల నిద్రలేమి ఈ సమస్యను అధిగమించవచ్చు..

– వారాంతాల్లో కూడా స్థిరమైన నిద్ర-వేక్ షెడ్యూల్ను నిర్వహించండి.
– మీ పడకగదిలో ప్రశాంతంగా, చీకటిగా, ఓదార్పుగా, సహేతుకమైన ఉష్ణోగ్రత ఉండేలా
చూసుకుంటే మంచి నిద్ర వస్తుంది. .
– పడకగదిలో టీవీ, కంప్యూటర్, మొబైల్ ఫోన్లను వదిలించుకోండి..
– నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనం లేదా కాఫీ లేదా మద్యం తాగవద్దు..
– పగటిపూట వ్యాయామం చేయడం వల్ల రాత్రిపూట డ్రిఫ్ట్ చేయడం సులభం
అవుతుంది..