అందరూ రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ వుంటారు. కానీ, గుండె సంబంధిత వైద్య పరీక్షల జోలికి అంతగా వెళ్లరు. మీరు గుండె సంబంధిత జీవనశైలి సమస్యలతో పోరాడుతున్నట్లయితే, ఇది చాలా కీలకమైనది. ఇటీవలి కాలంలో హృదయ సంబంధ వ్యాధుల ప్రాబల్యం పెరుగుతోంది. అందువల్ల, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, లక్షణాలకు చికిత్స చేయడం చాలా కీలకం. ఈ దిశగా వైద్యులు తరచూ ఒత్తిడి తెస్తూ వుంటారు.
పాశ్చాత్యులు , జపనీస్ కంటే 15 నుంచి 20 సంవత్సరాల ముందుగానే భారతీయులు గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తారు. కాబట్టి, ఈ మహమ్మారి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం చాలా కీలకమని ముంబైలోని మసినా హాస్పిటల్ కు చెందిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రుచిత్ షా అన్నారు.