ఇంటి నుంచి పని చేయడం (వర్క్ ఫ్రం హోమ్).. ఇది మహమ్మారి కంటే చాలా హానికరం. కాబట్టి, ఇలాంటి రిమోట్ కార్మికులు అనుభవించే శారీరక, మానసిక ఒత్తిడికి చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఇంటి నుంచి పని చేయడాన్ని ఆనందదాయకంగా మలచుకోవాలంటే ఈ రోజువారీ సూచనలు చూడండి.
ఇంటి నుంచి పని చేయడం కొత్త విధానం కాకపోయినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కోవిడ్ -19 వ్యాప్తి తర్వాత ఇది సర్వసాధారణంగా మారింది. ఈ ఆలోచన ఇప్పటికీ అమల్లో ఉన్నప్పటికీ, కరోనా వైరస్ మహమ్మారి సమయంలోనే ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. తర్వాత కూడా ఇంటి నుంచి పని చేసే సంస్కృతి కొనసాగుతున్నా.. ఇప్పుడు నెమ్మదిగా తిరిగి కార్యాలయాలకు వెళ్ళే పరిస్థితి వస్తోంది.
ఇంటి నుంచి పని చేసేటప్పుడు శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ వుంటారు. దానినుంచి విముక్తి కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకే పొజిషన్ లో ఎక్కువ సేపు కూర్చోవడం తగదు. అప్పుడప్పుడూ లేచి నడవడం మంచిది. కంప్యూటర్ పై ఎక్కువ సేపు ముందుకు ఒంగి పని చేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల నడుం నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడప్పుడూ కుటుంబ సభ్యులతో మాట్లాడడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇలాంటి ఆరోగ్య చిట్కాలు పాటిస్తే మానసిక, శారీరక ఒత్తిడిని నివారించవచ్చు.