ఆసియా స్త్రీలలో అత్యంత ప్రబలమైన సమస్య పోస్ట్-మెనోపాజ్ దశలో ఏర్పడే బోలు ఎముకల వ్యాధి. ఇది హృదయ సంబంధ వ్యాధుల వలే తీవ్రమైనది. ఎముకలు మరింత పెళుసుగా మారడానికి బోలు ఎముకల వ్యాధి కారణమవుతుంది. విరిగిపోయే సంభావ్యతను ఈ వ్యాధి పెంచుతుంది. ఎముక నష్టం ప్రమాదాన్ని తగ్గించడంలో కింది చర్యలు సహాయపడతాయి.
ఎముకలను బోలు ఎముకల వ్యాధి బలహీనపరుస్తుంది. ఆకస్మిక, ఊహించని పగుళ్లు ఏర్పడడం, ఎముకల సాంద్రత దెబ్బ తినడం వంటి అవకాశాల్ని పెంచుతుంది. దీనినే “పోరస్ ఎముక”గా పేర్కొంటారు. సగటు ఆయుర్దాయం 70 ఏళ్లకు పైగా పెరగడంతో రుతుక్రమం ఆగిన మహిళల ఆరోగ్యం ఒక ప్రధాన ప్రపంచ సమస్యగా మారుతోంది. చాలామంది మహిళలు వారి జీవితంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువకాలం మెనోపాజ్ దశ తర్వాత గడుపుతారు. కాబట్టి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డీ లోపం రాకుండా చూసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.