ఇప్పుడు చూద్దాం..
1.కాఫీలో ఉండే కెఫైన్ శరీరానికి కొన్ని రకాల మేలు చేస్తాయి.
2.కాఫీలోని కెఫీన్ అడ్రినలిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది వ్యాయామ సమయంలో
శారీరక సామర్థ్యాన్ని అధిగమించేలా చేస్తుంది.
3.కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సమ్మేళనాలు
ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి తోడ్పడతాయి.
4.బరువు తగ్గటంలోనూ కాఫీ తోడ్పడుతుంది. ఇందులోని కెఫిన్ కంటెంట్ మీ జీవక్రియను
పెంచుతుంది. కొవ్వును కరిగించేందుకు ప్రోత్సహిస్తుంది.
5.డయాబెటిక్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించటంలో కాఫీ ప్రభావం
చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
6.కాఫీ మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతుంది. మానసిక దృక్పథాన్ని పెంచుతుంది.
7.కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
8.కాఫీని అతి ఎక్కువగా తీసుకోవద్దు. అందులో ఉండే కెఫిన్ నిద్రలేమి సమస్యలకు
దారి తీస్తుంది.
9.తేనె, దాల్చినచెక్క రెండూ సహజమైన సమ్మేళనాలు. ఔషధ గుణాల కారణంగా ఎక్కువ కాలం
నిల్వ ఉంచవచ్చు.