తీసుకోవడానికి పాలు తాగుతారు. అయితే అందరూ పాలు తాగకూడదు.
కొన్ని సమస్యలు ఉన్న వారు పాలు తాగడంతో ఆరోగ్యం చెడిపోతుంది.
ఫ్యాటీ లివర్:
ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు పాలు తాగకూడదు. ఈ సమస్య ఉన్న వారు
పాలు తాగడంతో లివర్ లో కొవ్వు మరింతగా పేరుకుపోతుంది. దీంతో పరిస్థితి
దిగజారుతుంది.
లాక్టోస్ పడని వారు:
లాక్టోస్ పడని వారు పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వీరు పాలు తాగడంతో
చిన్న ప్రేగు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పాలు తాగిన 32 గంటల్లో జీర్ణ
వ్యవస్థలో ఏదైనా సమస్య వచ్చిందంటే లాక్టోస్ పడదని అర్థం చేసుకోండి.
వికారం:
చాలా మంది ఎక్కువగా వికారం, వాంతులు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారు
పాలు తాగకపోవడమే ఉత్తమం. పాలు తాగడంతో కడుపులో తిప్పడం, ఇబ్బందిగా అనిపించడం
వంటి సమస్యలు వస్తాయి.
క్యాన్సర్ రోగులు:
ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి క్యాన్సర్
సమస్యలతో బాధపడుతున్నవారు పాలు తాగకూడదు. పాలు తాగడంతో ఆరోగ్యం చెడిపోతుంది.
శ్వాస సమస్యలు:
పాలు తాగిన తర్వాత చాలా మందికి ఊపిరి తీసుకోవడంలో సమస్యలు వస్తాయి.
అటువంటివారు పాలు తాగకూడదు. పాలు తాగిన తర్వాత చాలా మందికి వాంతులు, మలంలో
రక్తం కూడా వస్తుంది.
చర్మ వ్యాధులు:
మీకు ఏవైనా చర్మవ్యాధులు ఉన్నట్లయితే పాలు తాగడాన్ని తగ్గించాలి. పాలు తాగడంతో
చర్మ సమస్యలు అధికం అయ్యే అవకాశం ఉంది.