నిద్రపట్టదు. ఇలాంటి వారు కొన్ని యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా సుఖనిద్ర
పొందుతారు. ఆ ఆసనాలేంటో చూద్దాం..
పాదంగుస్తాసనం:
కాలి బొటనవేళ్లపై ఒత్తిడి తగ్గించి పీయూష గ్రంథి పనితీరు మెరుగుపర్చడంలో
పాదంగుస్తాసనం సహాయపడుతుంది. దీనివల్ల స్లీప్ సైకిల్ మెరుగుపడుతుంది. మంచి
నిద్ర పడుతుంది.
ఉత్తాన ప్రిస్తాసనం:
ఒత్తిడి, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో ఈ ఉత్తాన ప్రస్తాసనం
ఉపయోగపడుతుంది. దీనివల్ల మంచి నిద్రకు ఈ ఆసనం కారణమవుతుంది.
ప్రాణాయామం:
డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గాలంటే మెడిటేషన్ చేయడం ఉత్తమం. డీప్
బ్రీతింగ్ వ్యాయామాలు కూడా మీ బాడీకి విశ్రాంతిని కల్పించి మంచి నిద్ర పట్టేలా
చేస్తాయి.
ఉత్తాన శిశోసనం:
వెన్నుముక, భుజాలపై ఒత్తిడి తగ్గించడంలో ఈ ఆసనం సహాయపడుతుంది. అలాగే రోజంతా
కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వారికి ఈ ఆసనం ఎంతో ఉపశమనం కలిగించి మంచి
నిద్రకు కారణమవుతుంది.
సుప్త మత్స్యేంద్రాసనం:
బాడీకి సరైన విధంగా రక్త ప్రసరణ జరిగేలా చూడటంలో ఈ ఆసనం సహాయపడుతుంది. తద్వారా
ఒత్తిడి తగ్గించి, మీకు ప్రశాంతత చేకూర్చి మంచి నిద్రకు కారణమవుతుంది.
విపరీత కరాణి:
గోడకు కాళ్లు పెట్టి అర్ధ శీర్షాసనం వేయడాన్నే విపరీత కరాణిగా చెబుతారు. ఇది
కండరాలను రిలాక్స్ చేసి, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా
మంచి నిద్రకు కారణమవుతుంది.
శవాసనం:
యోగా సెషన్ చివర్లో ఈ శవాసనం వేస్తారు. ఇది మీ బాడీకి పూర్తి విశ్రాంతిని
ఇస్తుంది. మెదడుపై ఒత్తిడి తగ్గించి మంచి నిద్రకు కారణమవుతుంది.