మొలకలు వస్తాయి. మొలకెత్తిన పల్లీలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో
చూద్దాం..
1.రోజూ గుప్పెడు పల్లీలను రాత్రిపూట నానబెట్టి ఉదయం మొలకలు వచ్చాక తినండి.
2.వీటిని రోజు తినడం అలవాటు చేసుకుంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
తద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
3.అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా ఇలా మొలకెత్తిన పల్లీలను తినడం అలవాటుగా
మార్చుకోవాలి.
4.పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఈ మొలకెత్తిన పల్లీలు ఉపయోగపడతాయి.
వీటిని తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది.
5.వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా నిండుగా
ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి.
6.డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు ఈ మొలకెత్తిన పల్లీలను రోజూ తినడం అలవాటు
చేసుకోవాలి.
7.ఇలా తినడం వల్ల అవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.