రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ నొప్పి వల్ల మాత్రం ఏ పని సరిగా చేయలేరు.
తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ కూడా వాడుతుంటారు. అయితే కొన్ని ఇంటి
చిట్కాలతో ఈ మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు అవేంటో చూద్దాం..
నువ్వుల నూనె:
రెండు స్పూన్ల నువ్వుల నూనె వేడి చేసి మెడపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ
వెచ్చదనానికి మెడ నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
నీరు:
రోజంతా నీరు పుష్కలంగా తాగాలి. కండరాల నొప్పుల సమయంలో శరీరాన్ని హైడ్రేట్‌గా
ఉంచడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించవచ్చు.
జీలకర్ర, ఉప్పు:
వేయించిన నల్ల జీలకర్ర, ఉప్పును చిన్న గుడ్డలో చుట్టండి. ఈ చిన్న బ్యాగ్ వేడి
చేసి మెడ నొప్పి ఉన్నచోట ఉంచండి. తద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
స్నానం:
గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. దీనివల్ల మెడ
నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
ఐస్ ముక్కలు:
ఐస్ ముక్కలను తీసుకుని ఓ క్లాత్ లో చుట్టాలి. దీంతో నొప్పి ఉన్న ప్రాంతంలో
కాపడం ద్వారా పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
కళ్లు సమాంతరంగా:
ల్యాప్‌టాప్, కంప్యూటర్, మొబైల్ లేదా టీవీ చూస్తున్నపుడు కళ్లను సమాంతరంగా
ఉంచండి. ఇది కళ్లు మరియు మెడపై ఒత్తిడి తగ్గించి మెడ నొప్పి రాకుండా
నివారిస్తుంది.
(గమనిక: ఇవి కేవలం సూచనలు మాత్రమే మెడనొప్పి తీవ్రంగా వేధిస్తుంటే వెంటనే
వైద్యున్ని సంప్రదించగలరు)