ముడతలు అందాన్ని దాచిపెడతాయి. ముడతలను తొలగించుకొని చర్మాన్ని బిగుతుగా
మార్చుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.
తేనె:
తేనె చర్మాన్ని డీటాక్సిఫై చేస్తుంది. తేనె చర్మం యొక్క ఎలాస్టిసిటీని
పెంచడంలో సహాయపడుతుంది. ముడతలు ఉన్న ప్రాంతంలో తేనె రాసుకొని 15 నిమిషాల
తర్వాత వాష్ చేయడంతో స్కిన్ బిగుతుగా మారుతుంది.
కీరా:
కీరాలో ఉన్న గుణాలు ఎలాస్టిన్, హైలురోనిక్ యాసిడ్ ను సమర్థవంతంగా
నిర్వహిస్తాయి. కీరా రాసుకోవడంతో చర్మం తేమగా మారుతుంది. నిత్యం హైడ్రేట్ గా
ఉండవచ్చు. కీరా రాసుకోవడంతో ముడతలు తగ్గుతాయి.
కాఫీ:
కాఫీలో ఉండే కెఫిన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో
చర్మంపై ముడతలు పడవు. కెఫిన్ యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. కాఫీ
పొడిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవడంతో ముడతలు రావు.
కలబంద:
కలబంద గుజ్జు చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జు
రాసుకోవడంతో చర్మం బిగుతుగా మారుతుంది. కలబంద కొల్లాజెన్, హైలురోనిక్ యాసిడ్
ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
అరటి ప్యాక్:
అరటిపండ్లలో పొటాషియం, విటమిన్లు, సహజ నూనె అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై
ముడతలను తగ్గిస్తాయి. అరటిపండు పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల
తర్వాత వాష్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడంతో ముడతలు రావు.
బాదం నూనె:
చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చడంలో బాదం. నూనె సహాయపడుతుంది. ఈ నూనె
చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. ఈ నూనె
రాసుకోవడంతో ముడతలు తొలగుతాయి.
అవకాడో ఆయిల్:
అవకాడో ఆయిల్ చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ ఆయిల్
రాసుకోవడంతో. చర్మం తాలూక స్థితిస్థాపకత పెరుగుతుంది. ఇది కొల్లాజెన్
ఉత్పత్తిని పెంచుతుంది.
పైనాపిల్:
పైనాపిల్ చర్మాన్ని ఆరోగ్యంగా మర్చుతుంది. ఇందులోని ఎంజైమ్స్ స్కిన్
ఎలాస్టిసిటీని పెంచుతాయి. మృతకణాలను తొలగించడంలో పైనాపిల్ సహాయపడుతుంది.
చర్మంపై ముడతలను ఇది తొలగిస్తుంది.