ఉండాలన్నా, శరీరంలో తగినంత విటమిన్ సి ఉండటం చాలా అవసరం. అయితే విటమిన్ సి
లోపం ఉంటే మీలో కొన్ని లక్షాణాలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం..
1.గోళ్లలో గుంటలు:
ఆరోగ్యవంతమైన గోళ్లు ఉబ్బెత్తుగా ఉంటాయి. అయితే విటమిన్ సి లోపం ఉన్నవారిలో
గోళ్లు గుంటలు పడినట్లు, పెళుసు బారినట్లు కనిపిస్తాయి. కొందరిలో పల్చగా మారి
తొందరగా విరిగిపోతాయి. మరికొందరిలో గోరు లోపలి నుంచి ఎర్రటి మచ్చలు
కనిపిస్తాయి.
2.చర్మం పాడవ్వడం:
చర్మం ఆరోగ్యంగా ఉండటం కోసం విటమిన్ సి అవసరం. ఈ విటమిన్ లోపిస్తే చర్మానికి
కావాల్సిన కొల్లెజన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీనివల్ల చర్మం నిగారింపు
తగ్గుతుంది. పొడిబారిపోయి, ముడతలు వస్తాయి.
3.రక్తస్రావం:
చర్మంపై ఏది తగిలినా తొందరగా గాయాలు అవుతాయి. రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది.
గాయాలు తొందరగా మానవు. అలాగే చర్మంపై అక్కడక్కడ ముదురు ఎరుపు రంగు మచ్చలు
కనిపిస్తాయి.
4.కీళ్ల వాపు:
కీళ్ల కణజాలాలకు కొల్లాజెన్ అవసరం. అయితే విటమిన్ సి లోపం వల్ల కొల్లాజెన్
ఉత్పత్తి తగ్గిపోయి కీళ్ల దగ్గర వాపు వస్తుంది. నొప్పి కూడా ఉంటుంది.
5.చిగుళ్ల వాపు:
విటమిన్ సి లోపిస్తే చిగుళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. చిగుళ్లలో వాపు,
రక్తస్రావం కనిపిస్తుంది. పళ్లు బలహీనంగా మారి కదిలిపోతాయి.
6.హైపర్ థైరాయిడిజం
విటమిన్ సి లోపం వల్ల థైరాయిడ్ గ్రంథుల నుంచి హార్మోన్లు అధికంగా స్రవించి
హైపర్ థైరాయిడిజానికి దారితీస్తుంది. తద్వారా అనుకోకుండా బరువు తగ్గడం,
గుండెదడ, ఆకలి పెరగడం, భయపడటం, వణుకు వంటి సమస్యలు వస్తాయి.
7.రక్తహీనత:
విటమిన్ సి లోపం రక్తహీనతకు కూడా దారితీస్తుంది. దీనివల్ల రక్తం తగ్గిపోయి
తొందరగా అలసిపోతారు. చిన్న పని చేయాలన్నా కూడా నీరసంగా ఉంటుంది.
8.వీటిని తీసుకోండి:
విటమిన్ సి లోపం కనిపిస్తే సిట్రస్ పండ్లు తినండి. జామ, నిమ్మ, నారింజ, కమలం,
స్ట్రాబెర్రీ, బొప్పాయి, కివి, చెర్రీ పండ్లు తినడం ద్వారా విటమిన్ సి లోపం
నుంచి బయటపడవచ్చు.