వల్ల ఎముకలు తొందరగా బలహీనపడతాయి. అలాగే మరికొన్ని డ్రింక్స్ ఎముకల్ని
బలపరుస్తాయి. అవేంటో చూద్దాం..
సోడా:
సోడాలో అధికంగా ఉండే సోడియం, అధిక చక్కెర ఎముకలకు హాని చేస్తాయి. ఇవి శరీరలో
కాల్షియం స్థాయిని తగ్గించి ఎముకల్ని బలహీనపరుస్తాయి. కావున సోడాకి దూరంగా
ఉండటం మంచిది
కెఫిన్:
అధికంగా కెఫిన్ పదార్థాలైన టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో
కాల్షియం స్థాయి తగ్గుతుంది. తద్వారా ఎముకలు బలహీనపడతాయి. కావున కెఫిన్
స్థాయిలు తగ్గించడం ఉత్తమం.
షుగర్ డ్రింక్స్
షుగర్ అధికంగా ఉన్న డ్రింక్స్ తాగడం వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయి. దీనిద్వారా
ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వీలైనంత వరకూ వీటిని తాగకపోవడం మంచిది.
ఆల్కహాల్:
ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయి. ఆల్కహాల్లోని కొన్ని
సమ్మేళనాలు శరీరంలో కాల్షియం శోషణను తగ్గిస్తాయి. వీలైనంత తక్కువగా ఆల్కహాల్
తీసుకోండి.
పాల ఉత్పత్తులు:
ఎముకలు బలంగా ఉండాలంటే పాల ఉత్పత్తులైన పెరుగు, చీజ్ తీసుకోవడం చాలా అవసరం.
వీటిలోని కాల్షియం, ప్రోటీన్లు ఎముకల బలం పెంచుతాయి. కావున రోజు పాలు తాగడం
ఎంతో మంచిది.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో ఐరన్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల్ని
ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి.
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లలో అధిక పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల
దృఢత్వాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
యాపిల్ జ్యూస్:
యాపిల్ జ్యూస్ విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా
చేస్తాయి. అలాగే ఆకుకూరలు, పండ్లు కూడా ఎముకలనీ బలపరుస్తాయి.