ఇప్పుడు చూద్దాం..
పోషకాలు:
100 గ్రాముల రామఫలంలో 75 కేలరీల శక్తి లభిస్తుంది. 100 గ్రాముల రామఫలంలో 17.7
గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.5 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. రామఫలంలో డైటరీ
ఫైబర్, విటమిన్ బి1, బి2, బి3, బి6 సమృద్ధిగా ఉంటాయి.
రోగ నిరోధకశక్తి:
రామఫలంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.
రామఫలంలో ఉండే విటమిన్ ఎ, బిలు చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
కీళ్లనొప్పి తగ్గుతుంది:
రామఫలంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ
రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో పోరాడతాయి. రామఫలం తినడంతో కీళ్లు ఆరోగ్యంగా
మారుతాయి. కీళ్ల నొప్పి తగ్గుతుంది.
యాంటీ క్యాన్సర్ ఏజెంట్:
రామఫలంలో యాంటీ క్యాన్సర్ ఏజెంట్ లక్షణాలు ఉంటాయి. ఇందులో ఉన్న అనోనాసిన్,
అనోకాటలిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి. రామఫలం తినడంతో వివిధ
రకాల క్యాన్సర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.
డయాబెటిస్:
రామఫలం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న
వారు రామఫలం తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. రామఫలంలోని మినరల్స్ రక్తంలో
చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
ఒత్తైన జుట్టు:
రామఫలం జుట్టును ఒత్తుగా మార్చడంలో సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు జుట్టును
కుదుళ్ల నుంచి బలంగా మార్చుతాయి. జుట్టు రాలే సమస్యను దూరం చేస్తాయి.
చుండ్రు నివారణ:
ప్రస్తుతం చాలా మంది చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రామఫలం పేస్ట్‌ను
తలకు రాసుకోవడంతో చుండ్రు తొలగుతుంది. పేలు సమస్య కూడా తగ్గుతుంది.
పిగ్మెంటేషన్
రామఫలంలో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.
హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో రామఫలం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మెరిసే చర్మం:
రామఫలం తినడంతో చర్మం మెరుస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ సి, విటమిన్ బి
కాంప్లెక్స్ చర్మంపై ఉన్న మొటిమలను తగ్గిస్తాయి. ఇందులో ఉన్న పోషకాలు
చర్మకణాలను ఆరోగ్యంగా మార్చుతాయి.