ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ ప్లాన్ కూడా ఫాలో అవుతుంటారు. అయితే కొన్ని
కారణాల వల్ల ఎంత ప్రయత్నించినా బరువు తగ్గరు. ఆ కారణాలేంటో చూద్దాం..
అధిక కేలరీ ఫుడ్:
బరువు తగ్గాలనుకునే వారు మీ శారీరిక శ్రమకు తగినన్ని కేలరీలు తీసుకోవాలి. మీరు
శ్రమించే దానికంటే ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల ఆ కేలరీలు బరువు
పెంచుతాయి. అందువల్ల తక్కువ కేలరీ ఫుడ్ తీసుకోవడం మంచిది.
ఆల్కహాల్:
ఆల్కహాల్ లో పోషకాలు తక్కువగా, కేలరీలు అధికంగా ఉంటాయి. దీనివల్ల చాలా
సులువుగా బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకుంటే మద్యం సేవించడం
మానుకోండి.
డీహైడ్రేషన్:
డీహైడ్రేషన్ వల్ల కొన్నిసార్లు ఆకలిగా ఉందన్న కారణంతో తింటుంటారు. కానీ అలాంటి
సమయంలో వాటర్ తాగితే సరిపోతుంది. ఇలా అనవసరంగా తినడం వల్ల కేలరీలు
పెరిగిపోతాయి. బరువు పెరుగుతారు.
ఒత్తిడి:
ఒత్తిడికి గురైనపుడు మీకు తెలియకుండానే ఎక్కువగా తింటుంటారు. ఏం తింటున్నారన్న
ఆలోచన కూడా ఉండదు. దీనివల్ల హార్మోన్ అసమతుల్యత ఏర్పడి బరువు పెరుగుతారు.
నిద్రలేమి:
నిద్రలేమి కారణంగా ఆకలి పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా తింటుంటారు. ఇది
హార్మోన్ బ్యాలెన్స్ పై చెడు ప్రభావం చూపి బరువు పెరిగేలా చేస్తుంది. అందువల్ల
రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవడం మంచిది.
కూర్చునే ఉండటం:
వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఎక్కువసేపు కూర్చోవడం వంటి సమస్యల వల్ల మీలో శారీరక
శ్రమ తగ్గుతుంది. దీంతో కేలరీలు ఖర్చు కూడా తగ్గి బరువు పెరుగుతారు. అందువల్ల
ఎక్కువసేపు కూర్చోవడం మానుకోండి.
ఎక్కువగా తినొద్దు:
బరువు తగ్గాలకున్నపుడు రోజులో ఎక్కువసార్లు తక్కువగా తినడం మంచిది. ఒకేసారి
ఎక్కువ మొత్తంలో తినడం వల్ల అధిక కేలరీల వల్ల బరువు పెరుగుతారు.
ప్లాన్ లోపాలు:
కొన్ని రోజులు బరువు తగ్గడం కోసం ప్లాన్ చేసి సక్సెస్ అవుతారు. కానీ తర్వాత
అశ్రద్ధ వహించడం వల్ల మళ్లీ బరువు పెరుగుతారు. అందువల్ల ఓ ప్లాన్ ఫాలో
అయినపుడు దాన్నే కొనసాగించడం ఉత్తమం.