చాలామంది ఖరీదైన ఫ్రూట్స్ తింటుంటారు. ఐతే చౌకైన ఆహార పదార్థాలతో కూడా
బ్రెయిన్ పవరన్ ను పెంచుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
పసుపు:
పసుపు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు మెదడును వృద్ధాప్య
సమస్య నుండి రక్షిస్తుంది.
తృణ ధాన్యాలు:
తృణ ధాన్యాలు తినడం వల్ల మెదడు కణాలకు ఆక్సిజన్ అందించే ఇనుము అందుతుంది.
కాఫీ:
కాఫీ తీసుకోవడం వల్ల మెదడు యాక్టివేట్ అవుతుంది అలాగే ఏకాగ్రత పెరుగుతుంది.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడికాయ గింజలు జ్ఞాపకశక్తిని, పెంచుతాయి మరియు మెదడు సామర్థ్యాన్ని
పెంచుతాయి.
బ్రోకలీ:
బ్రోకలీలో విటమిన్ కె ఉంటుంది, ఇది మెదడు పనితీరుకు ఉపయోగపడుతుంది.
చిక్కుడు:
చిక్కుడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.
బచ్చలికూర:
బచ్చలికూర మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది మెదడు శక్తిని పెంచడంలో పాత్ర
వహిస్తుంది.
పెరుగు:
పెరుగు తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
(గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను
సంప్రదించాలి.)