ఓట్స్ (అవేనా సాటివా) తృణధాన్యాలు ప్రధానంగా ఉత్తర అమెరికా, ఐరోపాలో పండిస్తారు. అవి ఫైబర్ కు మంచి మూలం. ముఖ్యంగా బీటా-గ్లూకాన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హోల్ వోట్స్ అవెనాంథ్రామైడ్ల ఏకైక ఆహార వనరు. ఇది గుండె జబ్బులు, అస్తమా నుంచి రక్షించగలదు. ఆస్తమా అనేది పిల్లలలో అత్యంత సాధారణ దీర్ఘకాలిక పరిస్థితి. ఇది వాయు మార్గాలకు సంబంధించిన ఇన్ఫ్లమేటరీ వ్యవస్థ. ఒక వ్యక్తి ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే గొట్టాల్లో సమస్య ఏర్పడుతుంది. పిల్లలందరికీ ఒకే విధమైన లక్షణాలు ఉండనప్పటికీ, చాలా మందికి పదేపదే దగ్గు, గురక, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. 6 నెలల వయస్సులోపు శిశువులకు ఓట్స్ తినిపించడం వల్ల చిన్ననాటి ఆస్తమా ప్రమాదం తగ్గుతుందని ఒక అధ్యయనం నివేదించింది.