ఏర్పడుతుంది. విటమిన్ ఏ పుష్కలం గా ఉన్న పదార్దాలు తీసుకోవడం ద్వారా కంటికి,
ఎముకలకు మేలు చేయడమే కాక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మరి విటమిన్ ఎ అధికంగా
లభించే ఆహార పదార్థాలేమిటో చూద్దాం..
1. క్యారెట్స్:
విటమిన్ ఏ అధికంగా లభించే వాటిలో క్యారెట్ ఒకటి. పచ్చి క్యారెట్స్
న్యూట్రియెంట్స్ అధికంగా ఉంటాయి. పచ్చి క్యారెట్స్ ను జ్యూస్ చేసుకుని కూడా
తాగవచ్చు.
2. చిలగడ దుంపలు:
చిలగడ దుంపల్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. వీటిని ఉడికించి తినడం ద్వారా
విటమిన్ ఎ అధిక మొత్తంలో శరీరానికి అందుతుంది.
3. ఆకు కూరలు:
ఆకుకూరలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఉండేది కాదు. ఆకు కూరల్లో ఉండే
పోషకాలన్నీ శరీరానికి మేలు చేస్తాయి. ఆకుకూరలు తినడం వల్ల రేచీకటి సమస్య
తగ్గుతుంది.
4. గుమ్మడికాయ
తియ్య గుమ్మడికాయ పులుసు తినని వారు ఉండరు. తియ్య గుమ్మడి ఎంత రుచిగా ఉంటుందో
అంత ఆరోగ్యకరం కూడా. ఒక్క పులుసే కాదు, తియ్య గుమ్మడి తో సూప్స్, పైస్,
స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు.
5. పాలు:
పాలలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. వీటిని ప్రతి రోజు తాగటం వల్ల ఎన్నో పోషకాలు
అందుతాయి.
6.బొప్పాయి పండు:
బొప్పాయిలో విటమిన్స్, మినరల్స్, ఎంజైంస్, యాంటీ-ఆక్సిడెంట్స్ తో నిండి
ఉంటుంది. ఈ పండుని సలాడ్స్, స్మూతీల్లో కూడా తీసుకోవచ్చు.