తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల కారణం కావొచ్చు. అలాంటి సమయంలో ఈ జ్యూస్ లు
తాగడం వల్ల శక్తి అందుతుంది..
కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీళ్లు సహజంగా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే కూలింగ్, హైడ్రేటింగ్
లక్షణాలను కలిగి ఉంటాయి. కావున వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి
లభిస్తుంది.
బటర్ మిల్క్:
మజ్జిగ విపరీతమైన వేడిలో కూడా మన శరీరాన్ని చల్లగా ఉంచేందుకు అవసరమైన
ప్రోబయోటిక్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.
నిమ్మరసం:
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి
ఉపయోగపడుతుంది. శరీరానికి తక్షణ శక్తినీ అందిస్తుంది.
పుచ్చకాయ:
పుచ్చకాయలో దాదాపు 90 % నీరు ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, C,
పొటాషియం అధికంగా ఉంటాయి.
జల్జీరా:
జల్జీరా మసాలా, పచ్చి జీలకర్ర పొడితో తయారు చేయబడిన రిఫ్రెష్ డ్రింక్. ఇది
యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనికి తాగడం వల్ల శరీరానికి మేలు
కలుగుతుంది.
చెరకు రసం:
చెరుకు రసంలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శీతలీకరణ లక్షణాలు కలిగి ఉంటుంది.
ఆరోగ్యాన్ని కాపాదుతుంది.