సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య రెట్టింపు అవుతోంది. చుండ్రును
వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి..
గోరు వెచ్చని నీటితో:
చుండ్రు సమస్యను వదిలించుకోవాలంటే వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వేడి
నీటితో స్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేయడంతో నెత్తిపై ఉన్న దుమ్ము, ధూళి
తొలగుతుంది.
తేలిక పాటి షాంపూ:
తలస్నానం చేసేటప్పుడు తేలికపాటి షాంపూను మాత్రమే వినియోగించాలి. కఠినమైన
షాంపూలు. వినియోగించడంతో తలలో సహాజంగా ఉత్పత్తి అయ్యే నూనెలు తొలగుతాయి. దీంతో
చుండ్రు పెరిగే అవకాశం ఉంది.
పొడిగా ఉంచుకోండి:
స్నానం చేసిన తర్వాత కానీ, వర్షంలో తడిచిన తర్వాత కానీ జుట్టును పూర్తిగా
ఆరనివ్వండి. జుట్టును తడిగా ఉంచడంతో చుండ్రు సమస్య పెరిగే అవకాశం ఉంది.
వర్షంలో తడిస్తే కచ్చితంగా తలస్నానం చేయండి.
మసాజ్:
తలస్నానం చేస్తున్న సమయంలో నెత్తికి మసాజ్ చేయండి. ఇలా చేయడంతో చుండ్రు
తొలగుతుంది. రక్తప్రసరణ సరిగా ఉంటుంది. జుట్టు ఒత్తుగా మారుతుంది. చుండ్రు
సమస్య దరిచేరదు.
వేపాకులు:
ఒక గిన్నెలో వేపాకులు వేసి బాగా మరిగించాలి. తల స్నానం చేస్తున్న సమయంలో ఈ
నీటిని ఉపయోగించడంతో చుండ్రు తొలగుతుంది. నెత్తి ఆరోగ్యంగా మారుతుంది.
గోకవద్దు:
చుండ్రు ఎక్కువగా ఉన్న సమయంలో దురద ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తలను గోకడంతో
చుండ్రు సమస్య పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో దువ్వెనను ఉపయోగించి
చుండ్రును తొలగించండి.
నిమ్మరసం:
చుండ్రు ఎక్కువగా ఉన్న సమయంలో నిమ్మరసం నెత్తికి అప్లై చేయాలి. ఇందులో ఉన్న
యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తొలగిస్తాయి. నిమ్మరసం నెత్తిని ఆరోగ్యంగా
మార్చుతుంది.
పెరుగు:
చుండ్రు అధికంగా ఉన్నప్పుడు నెత్తికి పెరుగు రాసుకోవడం ఉత్తమం. పెరుగు
వెంట్రుకల మూలాల నుంచి చుండ్రును తొలగిస్తుంది. పెరుగు అప్లై చేసిన 20 నిమిషాల
తర్వాత స్నానం చేయడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.