తొక్కని తీసివేసి తింటారు. కానీ వాటి తొక్కల లోనే ఏన్నో ఆరోగ్య
ప్రయోజనాలున్నాయని తెలుసుకోండి..
1.బంగాళదుంప:
ఆలూ తొక్కలోనే ఎక్కువ పోషకాలుంటాయి. పొట్టు తీసిన వాటికంటే పొట్టు తీయకుండా
ఉడికించిన వాటిలో విటమిన్ సి 175%, పొటాషియం 15%, ఫోలేట్ 11%, మెగ్నీషియం,
ఫాస్ఫరస్ II0% అధికంగా ఉంటాయి.
2.పుచ్చకాయ:
దీని తొక్కలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లముంటుంది. ఇది రక్తం సరఫరా సాఫీగా
జరిగేలా చేస్తుంది. విష పదార్థాలను బయటకు పంపుతుంది. కండలు పెరగడానికి, కండరాల
నొప్పులు తగ్గటానికి దోహదం చేస్తుంది.
3.యాపిల్:
పొట్టుతో కూడిన యాపిల్ లో విటమిన్ కె, ఎ, సి, కాల్షియం, పొటాషియం మెండుగా
ఉంటాయి. పీచూ ఎక్కువే. ఇందులో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటుంది.
ఇది మెదడు, ఊపిరితిత్తులు మరింత బాగా పనిచేయటానికి తోడ్పడుతుంది.
4.కీర దోస:
ముదురు ఆకుపచ్చ తొక్కలోనే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో
ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి, రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి తోడ్పడే
విటమిన్ కె సైతం దండిగానే ఉంటుంది.
5.మామిడి:
వీటి తొక్కల్లో బోలెడంత పీచు ఉంటుంది. విటమిన్ ఇ, సి, యాంటీ ఆక్సిడెంట్లు,
పాలీఫెనాల్స్, కెరొటినాయిడ్లూ ఎక్కువే. అంతేకాదు ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు
ఆమ్లాలూ ఉంటాయి. దీంతో ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన పోషకాలు శరీరానికి
అందుతాయి.
6.వంకాయ:
దీని తొక్కలోని నాసునిన్ అనే యాంతోసయానిన్ విశృంఖల కణాల దాడితో మెదడు కణాల
పైపొర దెబ్బతినకుండా కాపాడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కణాల
లోపలికి పోషకాలు వెళ్లేలా, లోపలి నుంచి వ్యర్థాలు బయటకు వచ్చేలా కూడా
చూస్తుంది.
7.కివీ:
కివీని తొక్కతో సహా తినటానికి సందేహించాల్సిన పనిలేదు. దీంట్లో ఫ్లేవనాయిడ్లు,
యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా లభిస్తాయి.
8.అరటి:
అరటి తొక్కలోనే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ల వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ల్యూటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటికి ఎంతో మేలు చేస్తుంది. అరటి తొక్కలో
ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లమూ ఉంటుంది. ఇది ప్రొటీన్లు, కండరాలు, ఎంజైమ్లు,
నాడీ సమాచార వాహకాల ఉత్పత్తి, నియంత్రణకు తోడ్పడుతుంది.