చాలా మంది వేసవి కాలంలో మాత్రమే నిమ్మరసాన్ని తాగుతారు. కానీ ప్రతి రోజు ఒక
గ్లాసు నిమ్మరసం తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..
గ్లాసు నిమ్మరసం తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..
1. రోజు నిమ్మకాయ రసం తీసుకోవటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.
2.నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
3.నిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణం గాయం నయం చేయడంలో సహాయపడుతుంది.
4.నిమ్మ నీరు అజీర్తి, ఉబ్బరం సమస్యలను కూడా తగ్గిస్తుంది.
5.నిమ్మరసం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
6.నిమ్మకాయ రసం గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇందులోని పొటాషియం కంటెంట్
రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
7.నిమ్మకాయ నీటిలో ఉండే విటమిన్ సి ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని
ప్రోత్సహిస్తుంది.
8.నిమ్మకాయ నీరు తీసుకోవటం ద్వారా కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో
సహాయపడుతుంది.