లక్ష్యాలు సులభంగా సాధించవచ్చు. ప్రస్తుతం చాలా మందిలో ఏకాగ్రత లోపిస్తుంది. ఈ
అలవాట్లు పాటించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
పరధ్యానం వద్దు:
ఏకాగ్రత కోల్పోతున్నామంటే దానికి కారణం పరధ్యానం. పరధ్యానాన్ని నివారించడంతో
ఏకాగ్రత పెరుగుతుంది. పరధ్యానానికి గల కారణాలు వెతకండి. సోషల్ మీడియా, ఇతరుల
గురించి ఆలోచించడం మానేయండి.
విరామాలు తీసుకోండి:
విరామాలు తీసుకుంటూ పని చేయడంతో ఏకాగ్రత పెరుగుతుంది. చేసే పనిలో చిన్న
విరామాలు తీసుకోవడంతో పనిని రెట్టింపు ఉత్సాహంతో చేయవచ్చు. పని మధ్యలో
వాకింగ్, శ్వాస వ్యాయామాలు చేయడం ఉత్తమం.
మ్యూజిక్ వినండి:
ఏకాగ్రతను పెంచుకోవడానికి మ్యూజిక్ ఎక్కువ సేపు వినడం మంచిది. ఎక్కువ సేపు
పాటలు వినడంతో మెదడు రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతంది. మానసిక ప్రశాంతత
లభిస్తుంది.
శ్వాస వ్యాయామం:
ఏకాగ్రతను మెరుగుపరచడంలో శ్వాస వ్యాయామాలు సరైన పాత్రను పోషిస్తాయి. శ్వాస
వ్యాయామాలు చేయడంతో ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఏకాగ్రతను మెరుగుపర్చడంలో
సహాయపడుతుంది.
ధ్యానం:
మెడిటేషన్ చేయడంతో ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడి జయించడానికి
సహాయపడుతుంది. ధ్యానం చేయడంతో వర్తమానంలో జీవించే అవకాశం లభిస్తుంది. కనీసం 10
నిమిషాల పాటు మెడిటేషన్ చేయడం ఉత్తమం.
ప్రశాంతమైన నిద్ర:
నిద్రలేమి కారణంగా అనేక సమస్యలు వస్తాయి. ఏకాగ్రత లేకపోవడం అనేది నిద్రలేమి
కారణంగా వస్తుంది. ప్రశాంతమైన నిద్ర పొందేందుకు ఎలక్ట్రానిక్ డివైజ్ లు
ఉపయోగించే సమయాన్ని తగ్గించండి. సరైన ఆహారం తీసుకోండి.
ప్రకృతితో మమేకం:
ప్రకృతితో మమేకం అవ్వడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. పచ్చని చెట్ల మధ్య
నడవటం, గడపటంతో ఏకాగ్రత రెట్టింపు అవుతుంది. ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.
వ్యాయామం:
రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వ్యాయామం చేయడంతో మెదడు చురుకుగా పని చేస్తుంది. ఏకాగ్రత సైతం పెరుగుతుంది.