తీసుకోవడం కూడా ముఖ్యం. అందుకే స్నాక్స్ కూడా క్యాలరీలు తక్కువగా ఉన్నవి తింటే
బరువు తగ్గుడానికి ఉపయోగపడుతుంది. అలా క్యాలరీలు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు
ఏమిటో చూద్దాం..
గుమ్మడి గింజలు:
వేయించిన గుమ్మడి గింజల్లో జింక్, మాగ్నిషియమ్, పొటాషియమ్ లాంటి మరిన్ని
పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మీ ఎముకల
ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వేడి చేసిన ప్యాన్ గుమ్మడికాయ గింజలు వేయించుకోవాలి. వాటిపై తగినంత ఉప్పు
వేసుకొని తినొచ్చు. బరువు తగ్గేందుకు ఇవి ఉపయోగపడతాయి.
సెనగలు:
వేయించిన సెనగల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వేయించిన తర్వాత సెనగలపై
కాస్త సాల్ట్, మీకు నచ్చిన సీజనింగ్ ఫ్లేవర్ వేసుకొని తినొచ్చు. వేయించిన
సెనగల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.
పాప్ కార్న్:
పాప్ కార్న్ కూడా క్యాలరీలు తక్కువగా ఉండే హెల్దీ పదార్థం అయితే, వీటిలో
వెన్నె సహా ఎక్కువ క్యాలరీలు ఉండే టాపింగ్స్ యాడ్ చేసుకోకూడదు.
క్యారెట్:
క్యారెట్ లో క్యాలరీలు తక్కువగా పోషకాలు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. క్యారెట్
ను ముక్కలుగా కట్ చేసి తినొచ్చు. దీని ద్వారా మంచి ప్రొటీన్, కాల్షియమ్
అందుతాయి.