చక్కని, చిక్కని కాఫీ ఆరోగ్య ప్రయోజనాలతో ఉండటం సాధారణం.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటమే అందుకు కారణం
కా, కాఫీ తాగడం వల్ల దీర్ఘాయువు, టైప్ 2 డయాబెటిస్, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధులు, అనేక ఇతర అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాల ద్వారా వెల్లడైంది. అత్యంత ప్రయోజనకరమైన ఈ కాఫీని రోజుకు 3-4 కప్పులుగా తాగితే బెటర్ అంటున్నారు నిపుణులు. గర్భిణీలు మాత్రం దానిని పరిమితంగా లేదా పూర్తిగా నివారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది తక్కువ జనన బరువుతో ముడిపడి ఉంటుంది.
అయితే కాఫీ, ఏదైనా కెఫిన్ ఆధారిత వస్తువులను మితంగా తీసుకోవడం మంచిది. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి, గుండె దడ వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చని మరికొందరు చెబుతున్నారు.
కాఫీని సురక్షితమైన, ఆరోగ్యకరమైన రీతిలో ఆస్వాదించడానికి, రోజుకు 4 కప్పుల వరకు తీసుకోవచ్చు.
అంత వరకు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. కాఫీ కలుపుకునేటప్పుడు తియ్యటి క్రీమర్ వంటి అధిక కేలరీలు, అధిక చక్కెరను నివారిస్తే మరింత సురక్షితం.