శరీరానికి మంచి జరుగుతుంది. బ్రకోలీ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
1.బ్రకోలీలో కాల్షియమ్, విటమిన్-కె పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇది తింటే ఎముకల
ఆరోగ్యం, దృఢత్వం మెరుగవుతుంది.
2.బ్రకోలీలో జింక్, విటమిన్ ఏ, విటమిన్ సీ, యాంటీ ఏజింగ్ కారకాలు ఉంటాయి.
దీంతో ఇది చర్మానికి కూడా చాలా మంచిది.
3.విటమిన్ సీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని
బ్రకోలీ మెరుగుపరుస్తుంది.
4.బ్రకోలీ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగడంతో పాటు ఇన్ఫెక్షన్ లు
దరిచేరకుండా చేస్తుంది.
5.సల్ఫోరఫేన్ అనే బయోయాక్టివ్ కాంపౌండ్ ఉండడం వల్ల బ్రకోలీ శరీరంలోని షుగర్
లెవెళ్లను తగ్గిస్తుంది. అందుకే బ్రకోలీ తీసుకుంటే షుగర్ వచ్చే ప్రమాదం
తగ్గుతుందని చాలా అధ్యయానాలు వెల్లడించాయి.
6.బ్రకోలీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. జీర్ణ వ్యవస్థకు ఇది
మేలు చేస్తుంది.
7.మెదడు పనితీరు మెరుగయ్యేందుకు కూడా బ్రకోలీ తోడ్పడుతుంది.