1.ఆలివ్ నూనెలో ఉండే విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు తలమీద ఉన్న చర్మాన్ని
మృదువుగా చేస్తాయి.
2.ఆలివ్ నూనెతో మర్దన చేయడం వల్ల జుట్టు పొడిబారిపోవడం, తెల్లబడటం, వంటి
సమస్యలు తగ్గుతాయి.
3.చుండ్రు కారణంగా పొడిబారిపోయిన జుట్టుకి ఆలివూనెతో మర్దన చేయడం వల్ల మంచి
ఫలితం ఉంటుంది.
4.ఆలివ్ నూనెతో మర్దన చేయడంతో మెలనిన్ వర్ణద్రవ్యం తిరిగి ఉత్పత్తి అయి కురులు
నల్లగా నిగనిగలాడతాయి.
5.ఆలివ్ ఆయిల్ ను వేడిచేసి వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి తలస్నానం చేస్తే
జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.
6.ఆలివ్ ఆయిల్ r వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి తలకు రాసుకుంటే
జుట్టు త్వరగా నెరవదు.
7.ఆలివ్ ఆయిల్ లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు రాచుకుని కాసేపటి
తర్వాత తలస్నానం జుట్టు మెత్తగా మారుతుంది.