ఎండిపోయి గట్టిపడటం ప్రారంభమవుతుంది. శరీరం కూడా తక్కువ సైనోవియల్ ద్రవాన్ని
ఉత్పత్తి చేయడంతో కీళ్ల పై దుష్ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు గమనించారు.
కీళ్లు సజావుగా కదలకుండా ప్రభావం చూపుతుంది. ఫలితం గా కీళ్ళు గతంలో ఉన్నంత
స్వేచ్ఛగా కదలకపోవచ్చు. కనీసం నడవలేని స్థితి కలిగిస్తుంది . అయితే ప్రయత్న
పూర్వకంగా నడక ద్వరా కీళ్లను కదిలించ గలగాలి. కీళ్లను వదులుగా ఉంచడానికి
సైనోవియల్ ద్రవానికి కదలిక అవసరం.
సాధారణంగా కీళ్ల నొప్పులకు వాతావరణ మార్పులకు సంబంధం ఉన్నట్లు
గుర్తించారు. వైద్యులు వాతావరణం మారినప్పుడు కీళ్ల నొప్పులు మరింత
తీవ్రమవుతాయని స్పష్టం చేస్తున్నారు.. గాలి పీడనం (వాతావరణ భవిష్య సూచకులు
దీనిని బారోమెట్రిక్ పీడనం అని పిలుస్తారు) పడిపోయినప్పుడు ఇది సర్వసాధారణం.
ఇది సాధారణంగా తుఫానుకు ముందు జరుగుతుంది, ఒక అధ్యయనం గమనించింది.
కీళ్ళు ఉదయం మరింత గట్టిగా ఉంటాయి, వేడి షవర్ లేదా ఆవిరి పట్టడం ద్వారా
రక్త ప్రసరణ పెంచుతుంది . తద్వార బిగుసుకు పోయిన కీళ్లు మరియు కండరాలను
వదులు చేస్తుంది. తేమతో కూడిన హీట్ ప్యాడ్లను ఉపయోగించడం ద్వార మరింత
రిలీఫ్ వస్తుంది. స్వంతంగా తయారు చేసుకోవచ్చు. వాష్‌క్లాత్‌ను ఫ్రీజర్
బ్యాగ్‌లోకి వేసి 1 నిమిషం పాటు మైక్రోవేవ్ చేయండి. ఒక టవల్లో చుట్టి, ఆ
ప్రదేశంలో 15-20 నిమిషాలు ఉంచడం ద్వారా తయారు చేసుకోవచ్చు .