మెదడు మన శరీర బరువులో కేవలం రెండు శాతం వరకు మాత్రమే ఉంటుంది.. కానీ అది
వినియోగించుకునే శక్తి ఏకంగా 20 శాతం. శరీరంలో అధికంగా గ్లూకోజ్ ఉండడం లేదా
అతి తక్కువగా ఉంటుండడం వంటివి మెదడులోని సున్నితమైన వ్యవస్థలను దెబ్బతీస్తాయని
ఇంగ్లాండ్ కు చెందిన రోహంప్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు చాలా తక్కువగా ఆహారాన్ని తీసుకుంటారని, దానివల్ల
మెదడులో కీలకమైన ‘ఫ్రంటల్ కార్టెక్స్’ భాగం పనితీరు మందగించే ప్రమాదం ఉంటుందని
గుర్తించినట్లు వారు చెబుతున్నారు.
అందువల్లే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోయినప్పుడు ఏదైనా విషయంపై
దృష్టి సారించలేకపోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, గందరగోళ పడడం వంటివి తలెత్తుతాయని
స్పష్టం చేస్తున్నారు.
ఇక ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు
పెరుగుతాయని, దీనివల్ల మెదడుతోపాటు శరీరంలోని అన్ని అవయవాలపైనా ప్రతికూల
ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా తక్కువగా ఉండకుండా ఉండాలంటే.. ఒకేసారి
ఎక్కువగా ఆహారాన్ని తీసుకోకుండా ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం
తీసుకోవాలని సూచిస్తున్నారు.