కార్యక్రమాలు జీవన నాణ్యతలో మెరుగుదలతో ముడిపడి ఉన్నాయి, అయితే అవి ఆరోగ్య
సంరక్షణ ఖర్చులను కూడా తగ్గించవచ్చని ఒక కొత్త అధ్యయనం తెలిపింది.
ఏప్రిల్ 28న 24వ అమెరికన్ సొసైటీ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ వార్షిక సమావేశంలో ఓ
అధ్యయనం ఫలితాలు ఆవిష్కృత మయ్యాయి. ఈ సందర్భంగా రొమ్ము క్సాన్సర్ బాధితులకు
ఉపశమనం కలిగించే విషయం బ్రీఫింగ్లో ప్రధానంగా హైలైట్ చేయబడింది.
అధ్యయనంలో భాగంగా ప్రారంభ దశ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న 240 మంది
రోగులకు 12 వారాల పాటు రొమ్ము పరిసర భాగాలకు వ్యాయామం అందించబడింది.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాయామ
సమూహం లో క్యాన్సర్ ఉన్నవారి కోసం 12 వారాల వ్యక్తిగతీకరించిన వ్యాయామ
కార్యక్రమాన్ని అందించింది.
ఇందులో ప్రతి వారం 150 నిమిషాల హృదయ సంబంధ వ్యాయామాలైన వాకింగ్ లేదా
రీకంబెంట్ సైక్లింగ్, అలాగే రెండు లేదా మూడు 60 నిమిషాల పూర్తి-శరీర
వ్యాయామాలతో పాటు ఉచిత బరువులు లేదా వ్యాయామ స్ట్రెచ్ బ్యాండ్లు ఉంటాయి. ఈ
నేపథ్యంలో ప్రత్యేక వ్యా యామం క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మెరుగైన
ఫలితాలు సాధించ వచ్చు .