ఆస్తమా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఆస్తమా బారినపడిన వారి
ఊపిరితిత్తుల్లోని వాయు మార్గాలు ఎర్రబడి కుచించుకుపోతాయి. దాంతో శ్వాస
తీసుకోవడం కష్టంగా మారుతుంది. విపరీతమైన దగ్గు, ఛాతీలో నొప్పి వంటివి
తలెత్తుతాయి. అమెరికాలోనే సుమారు 25 లక్షల మంది ఆస్తమా బాధితులు ఉన్నారని
శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది
పిల్లలు ఆస్తమాతో బాధపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక భారతదేశంలోనూ చిన్న
పిల్లల్లో పది శాతం మంది వరకు ఏదో ఒక స్థాయిలో ఆస్తమా బారిన పడుతున్నట్లు
అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీరంలో విటమిన్-డీ తక్కువగా ఉంటే ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన
కారణాలు తెలియకపోయినప్పటికి ఉబ్బసం వల్ల ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ.
శిశువుల్లో జన్యు లోపం వల్ల కూడా ఇది సంభవించవచ్చు.
వేర్వేరు వ్యక్తులకు ఆస్తమా రావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. అందువల్ల
ఆస్తమాతో బాధపడుతున్నవారు తమ సమస్య ఏమిటన్నది కచ్చితంగా తెలుసుకుని చికిత్స
తీసుకోవాల్సి ఉంటుంది.
తరచూ జలుబు, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతుంటే అది ఆస్తమా అయి ఉండవచ్చని
ప్రాథమికంగా భావించవచ్చు. దీనిని వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాల్సి
ఉంటుంది.
ఊబకాయం, శరీరంలో అధిక కొవ్వుతో బాధపడుతున్న వారు తొందరగా ఆస్తమా బారిన పడే
అవకాశాలు ఎక్కువ.
ఆస్తమా సమస్యను పూర్తిగా నివారించగలిగే మందులు, చికిత్సా పద్ధతులేవీ ప్రస్తుతం
అందుబాటులో లేవు. జాగ్రత్తలు మాత్రమే నివారణకు తోడ్పడతాయి. ఆస్తమా వస్తే
వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే చిన్న పిల్లల్లో వచ్చే కొన్నిరకాల స్వల్పస్థాయి ఆస్తమాలకు మాత్రం తగిన
చికిత్స తీసుకుంటే.. వారు పెద్దయ్యే కొద్దీ ఆస్తమా పూర్తిగా తగ్గిపోయే
అవకాశాలు ఉన్నాయి. అయితే వారు విపరీతమైన చలికి గురికావడం, దుమ్ము, కాలుష్యం
వంటివాటికి దూరంగా ఉండడం అవసరం.