కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. రక్తంలో మలినాలు, వ్యర్థాలు పేరుకుపోవడం నాలుకపై
ఉండే రుచి గుళికల (టేస్ట్ బడ్స్) పనితీరుపై ప్రభావం పడుతుంది. దానివల్ల మనం
తినే ఆహారం రుచిని సరిగా గుర్తించలేకపోతాం. ఏదో ఇనుప వస్తువును నోటిలో
పెట్టుకున్నట్టుగా నోరంతా లోహపు రుచి కలిగిన భావన ఉంటుంది.
ఇక కిడ్నీల్లో తగిన విధంగా శుద్ధికాని రక్తం ఊపిరితిత్తులకు చేరుతుంది.
ఊపిరితిత్తుల్లో రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి, గాలిలోని ఆక్సిజన్
రక్తంలోకి చేరే ప్రక్రియ సమయంలోనే.. రక్తంలో ఉన్న మలినాలు, విషపూరిత పదార్థాలు
వాయురూపంలోకి మారి గాలిలో కలుస్తాయి. ఇలా మలినాలు, విషపూరిత రసాయనాలు కలసిన
గాలి ఊపిరితిత్తుల్లోంచి బయటికి వచ్చినప్పుడు మన శ్వాసలో దుర్వాసన వస్తుంది.
నోటి రుచి దెబ్బతినడం, శ్వాసలో దుర్వాసన కారణంగా సరిగా ఆకలి తగ్గిపోవడం, సరిగా
ఆహారం తీసుకోకపోవడం జరిగి.. బరువు తగ్గిపోతారు.
నోటిలో దుర్వాసన, లోహపు రుచి వంటివి తలెత్తినప్పుడు వైద్య పరీక్షలు
చేయించుకోవడం మంచిది.
అయితే నోరు సరిగా శుభ్రం చేసుకోకపోవడం, అలర్జీలు వంటి ఇతర ఆరోగ్య కారణాల వల్ల
కూడా శ్వాసలో దుర్వాసన, నోటిలో లోహపు తరహా రుచి సమస్యలు వస్తాయి. ఇలాంటి
సమస్యలే అయితే.. సాధారణ చికిత్స తోనే తగ్గిపోతాయి.
చికిత్స తీసుకున్నా రుచి, శ్వాస సమస్య తగ్గకపోతే కచ్చితంగా కిడ్నీలకు
సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.