ప్రస్తుతం ప్రపంచంలో ఊబకాయం అనేది సర్వసాధారణమైపోయింది . అమెరికా లాంటి
దేశాలలో అయితే ఈ ఊబకాయం చికిత్స కోసమే వేలాదిమంది ఆసుపత్రులకు వస్తున్నట్లుగా
తేలింది . ఊబకాయం వల్ల డయాబెటిక్ , హై బీపీ, గుండె వ్యాధులు లాంటివి
వస్తున్నాయి. అయితే క్లినికల్ ఎండ్రోక్రాలజీ అండ్ మెటాబాలిజం జర్నల్ లో
ప్రచురితమైన అంశాలు ఆసక్తిగా ఉన్నాయి. మహిళలకు ఊబకాయం ఉంటే వారి కూతుళ్లకు
కూడా ఊబకాయం వస్తున్నట్లుగా పరిశోధనలో తేలింది . అయితే కుమారులకు మాత్రం
ఊబకాయం రావడం లేదు. అమెరికా లాంటి దేశంలో దాదాపుగా 20 శాతం మంది పిల్లలు
ఊబకాయం కలిగి ఉన్నారు. ఇదంతా వారి తల్లుల నుంచి వచ్చినట్లుగానే తేలిందని
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆంఫ్టన్ చెందిన ఎం.ఆర్.సి లైఫ్ కోర్స్ ఎపిడమాలజీ సెంటర్
వైద్య నిపుణుడు రేబాక జే మాన్ చెబుతున్నారు. తల్లులు ఊబకాయంతో ఉంటే
వారికున్నటువంటి ఫ్యాట్ పరిస్థితిని అంచనా వేసినప్పుడు, వారికి పుట్టిన
కూతుళ్ళలో కూడా ఈ ఫ్యాట్ కంటెంట్ కనిపిస్తోందని ఆయన చెప్పారు. అయితే కుమారులు
పుట్టినప్పుడు మాత్రం అలాంటివి ఎందుకు లేదన్న దిశగా తాము మరింత విస్తృత
పరిశోధనలు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ పరిశోధకులు దాదాపు 240 మంది
పసిపిల్లలను పరిశీలించినప్పుడు వారి తల్లుల నుంచే ఊబకాయం వస్తుందని తేలినట్టు
చెప్పారు. తల్లుల నుంచి కూతుళ్లకు ఓవర్ వెయిట్ సమస్యలు సంక్రమిస్తుండగా., అదే
సమయంలో తల్లులకు కుమారులకు మధ్య పెద్దగా సారూప్యత ఉండడం లేదు . మరొక ముఖ్యమైన
అంశం ఏమిటంటే ఒబెసిటీ విషయంలో తండ్రులకూ., అతని కూతుళ్లు గానీ, కొడుకులకు
గానీ, సారూప్యత వంశపారంపర్య పరిస్థితులు గానీ కనిపించడం లేదని తేలింది.