కాలేయ వ్యాధికి కారణమవుతున్న ఆహార పదార్థాలు ఏంటి ….లివర్ చక్కగా
పనిచేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…. అనే దిశగా మిస్సౌరీ స్కూల్ ఆఫ్
మెడిసిన్ విశ్వవిద్యాలయం విస్తృత పరిశోధనలు చేసింది. అందులో తేలింది ఏంటంటే
చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, అలాగే ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం
– కాలేయ వ్యాధికి కారణం అవుతుందని తేలింది .ముఖ్యంగా పాశ్చాత్య ఆహారపు
అలవాట్లు ఆహార పదార్థాల వల్ల తీవ్రమైనటువంటి లివర్ రోగాలు వస్తున్నట్లు
గుర్తించారు.
ఇందుకు సంబంధించి ఇప్పుడిప్పుడే పరిశోధనలు ప్రారంభించామని , కాలేయ వ్యాధికి
దోహదపడే జీవక్రియలనూ , ఆ జీవక్రియలపై ప్రభావితం చూపే ఆహార పదార్థాలను
గుర్తించగలిగామని మాలిక్యులర్ మైక్రోబయాలజీ విభాగం అధిపతి చెప్పారు. ఎలుకలపై
తాము జరిపిన పరిశోధన అంశాలను వారు వివరిస్తూ ఫ్యాటీ లివర్ డిసీజ్ కు తీపి
పదార్థాలు కారకం అవుతున్నాయని తమ పరిశోధనలు తేల్చినట్టు చెప్పారు.
అంతేకాకుండా తాగునీటి ద్వారా నిర్వహించే ఆంటీబయాటిక్ కాక్టెల్ థెరఫీ ద్వారా
ఫ్యాటీ లివర్ తగ్గుతున్నట్టు కూడా గుర్తించామన్నారు. ఈ చికిత్స వల్ల కాలేయంలో
ఏర్పడే వివిధ వివిధ రుగ్మతలను కూడా నివారించవచ్చని వెల్లడించారు.