వైద్య పరిభాషలో మైల్డ్ కాగ్నిటివ్ ఎంపైర్మెంట్ అంటే ..స్వల్పంగా మెమరీ లాస్
ప్రారంభం కావడం అని అర్థం . 50 ఏళ్ల తర్వాత చాలామందిలో ఈ రుగ్మత
ప్రారంభమవుతుంది. ఇలా జ్ఞాపకశక్తి తగ్గుతున్నటువంటి వారికి ఆలివ్ ఆయిల్ బాగా
పనిచేస్తుందని ఫార్మసీ నిపుణులు కనుగొన్నారు . న్యూట్రియంట్స్ అనే జర్నల్లో
ఈ అంశాలను పొందుపరిచారు . స్వల్పంగా అప్పుడప్పుడే జ్ఞాపకశక్తి క్షీణిస్తున్న
25 మందిని ఎంచుకొని వారికి 30 మిల్లీలీటర్లు లేదా మూడు స్పూన్ల ఆలివ్ ఆయిల్
ఇచ్చారు. ఇలా ప్రతిరోజు ఇస్తూ ఆరు నెలల పాటు వారి పరిస్థితిని అంచనా వేశారు
. ఇందులో 13 మందికి పచ్చి ఆలివ్ నూనె అంటే శుద్ధి చేసినది కాకుండా ముడి
నూనెను ఇచ్చారు. అలాగే మరో 12 మందికి శుద్ధి చేసిన ఆలివ్ నూనెను ఇవ్వడం
జరిగింది. ఇలా ఆలీవ్ నూనె తీసుకున్న తర్వాత వారి మీద పలు రకాల పరీక్షలు
జరిపారు . ఇందులో ఎమ్మారై స్కాన్ లాంటివి., మెమరీ కి సంబంధించిన పరీక్షలు.,
అలాగే రక్త పరీక్షలు, విశ్లేషణ లాంటివి చేశారు. ఈ పరీక్షలు అన్నీ కూడా
అల్జీమర్స్ వ్యాధి వచ్చిన వారికి జరిపే పరీక్షలే కావడం గమనార్హం. ఆసక్తికరమైన
విషయం ఏంటంటే, ఈ రకంగా జరిపిన వివిధ పరీక్షల్లో ఫలితాలు ఒకేలా లేవు.
అంతేకాకుండా వారిలో జ్ఞాపకశక్తి పెరిగినట్లుగా నిరూపితమైంది
జ్ఞాపక శక్తిని పెంచడంలో ఆలివ్ ఆయిల్ ప్రభావం పాజిటివ్ ఉందని తమ
అధ్యయనాలుతేల్చినప్పటికీ, ఈ ప్రక్రియను దీర్ఘకాలికంగా చేపట్టి, తద్వారా
అల్జీమర్స్ వ్యాధికి విరుగుడును నిర్ధారించడం జరుగుతుందని పరిశోధకులు
వెల్లడించారు. మెమరీ లాస్ ఎదుర్కొంటున్న వారు ఇప్పటినుంచే ఆలీవ్ ఆయిల్
వినియోగించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని., శరీరానికి కూడా మంచిదని
చెబుతున్నారు.