షుగర్ పేషెంట్ల మాటేమిటి.. అనే మీమాంసపై పై వైద్య నిపుణులు కొన్ని సూచనలు
చేస్తున్నారు.
“పచ్చి మామిడి తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పండిన మామిడికాయలు తింటే షుగర్
లెవల్స్ పెరుగుతాయి. ఎంతకీ షుగర్ కంట్రోల్ కానివారు పండిన మామిడి తింటే చాలా
కష్టం. అయితే, షుగర్ బాధితులు కూడా మామిడి పండ్లు తినేందుకు కొన్ని మార్గాలు
ఉన్నాయి. తగిన మోతాదులోనే తినాలి. మితిమీరి తినరాదు. కొన్ని చోట్ల బాగా
తియ్యగా ఉండే మామిడిపండ్లు దొరుకుతాయి, కొన్నిచోట్ల సాధారణ వెరైటీలు
అందుబాటులో ఉంటాయి. ఏదేమైనా పరిమితంగా తినడం ఆరోగ్యానికి మంచిది. అతిగా తింటే
కష్టాలు తప్పవు” అని చెబుతున్నారు.
ముంబై కి చెందిన డయాబెటాలజిస్ట్ మాట్లాడుతూ గ్లూకోజ్ లెవల్స్ పూర్తి
కంట్రోల్ లో ఉన్నప్పుడు ఎవరైనా మామిడిపండ్లు తినొచ్చని స్పష్టం చేశారు.
మామిడి పంట్లను తగిన సమయంలో, తగిన విధంగా తినాలని పేర్కొన్నారు. మధుమేహం టైప్
ను బట్టి సగటున సగం మామిడిపండు తినడం మేలని సూచించారు. అయితే అన్నం తిన్న
వెంటనే మామిడిపండు తీసుకోవడం సరికాదని తెలిపారు. మధ్నాహ్న భోజనం, రాత్రి
భోజనానికి మధ్య స్నాక్ ఐటమ్ లా మామిడిని తీసుకోవడం ఉత్తమం అని వివరించారు.
ప్రముఖ డైటీషియన్ ఒకరు స్పందిస్తూ… మామిడి అనేక పోషకాలకు నిలయం అని,
డయాబెటిస్ తో బాధపడేవారు మామిడి ద్వారా తగిన పోషకాలను పొందవచ్చని తెలిపారు. ఓ
షుగర్ పేషెంట్ బ్లడ్ షుగర్, రక్తపోటు, పొటాషియం స్థాయులు పరిమితికి లోబడి
ఉంటే, నిరభ్యంతరంగా మామిడిపండ్లు తినొచ్చని చెప్పారు. మామిడిపండ్లు తినే
విషయంలో షుగర్ బాధితులు డైటీషియన్ల సలహా తీసుకోవడం ఉత్తమం అని సూచించారు.